అడవుల పరిరక్షణకు అటవీ శాఖ అధికారులు అంకితభావంతో పని చేయాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపుకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు.అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఇతర అధికారులు అరణ్య భవన్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ అధికారులు, సిబ్బంది అడవుల పరిరక్షణకు నిరంతరం పని చేస్తున్నారని అభినందించారు.ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు ఎం.సీ. పర్గెయిన్, వినయ్ కుమార్, ఏ.కే.సిన్హా, సునీత భగవత్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, తదితరులు పాల్గొన్నారు.