సంగారెడ్డి జిల్లాలోని సవారియా పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం


సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, నందిగామ గ్రామ పరిధిలోని సవారియా అనే  పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. ఇనుప రాడ్లను క్రేన్ సహాయంతో తీసుకువెళుతుండగా బరువు ఎక్కువై తీగ తెగి నలుగురు కార్మికులపై పడటంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రేమ్ కుమార్, పాజ్థార్‌లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు జితేంద్ర కుమార్, ఆనంద్ కుమార్‌లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని  ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భానూరు పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.