సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పదవీ కాలం పొడిగింపు

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు శ్రీధర్‌ను ఆ పదవిలో కొనసాగిస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జనవరి1 నుంచి శ్రీధర్‌ ఆ పదవిలో కొనసాగుతుండగా, ఇప్పటికే ఐదుసార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పటికే ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న శ్రీధర్‌కు మళ్లీ పొడిగింపు ఇవ్వడం గమనార్హం.