రూ. 17 వేల లంచం తీసుకుంటూ కరీంనగర్ నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) పీవీ రామన్, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. మధుకర్ అనే కాంట్రాక్టర్‌కు మూడు పనులకు సంబంధించిన రూ. 17 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. అయితే.. ఈఈ రామన్ ఫైళ్లను కమిషనర్‌కు పంపించకుండా తన వద్దే ఉంచుకున్నారు. 17 వేలు తనకు లంచం ఇవ్వాలని మధుకర్‌ను డిమాండ్ చేశారు. చేసేది లేక.. కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు మధుకర్, రూ. 17వేలతో రామన్ వద్దకు వెళ్లారు. ఈఈ ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.