27న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్న ఎల్ రమణ

ఈ నెల 27న మాజీమంత్రి ఎల్ రమణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా రమణ గెలిచారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం  రమణ విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎల్ రమణ విజయం సాధించారు. రమణకు 450 ఓట్లు వచ్చాయి.