ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌ఓ)గా చంద్రకాంత్‌

ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌ఓ)గా రాజేంద్రనగర్‌ డిపో మేనేజర్‌ చంద్రకాంత్‌ నియమితులయ్యారు. ఇంతకాలం పీఆర్‌ఓగా పనిచేసిన కిరణ్‌ను వరంగల్‌ రీజియన్‌కు బదిలీచేశారు. త్వరలో జరిగే మేడారం జాతరకు సంబంధించి బస్సుల నిర్వహణలో ఆయన వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌కు సహాయకారిగా ఉండాలని ఎండీ సజ్జనార్‌ ఆదేశిస్తూ ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్‌–3 డీఎం శ్రీనాథ్‌ను రాజేంద్రనగర్‌ డీఎంగా బదిలీచేశారు.