ప్రముఖ కవి, రచయిత ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత

సాహితీ వేత్త, కవి, రచయిత, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ (63) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సుధాకర్‌ మృతిపట్ల  తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీ శంకర్‌తో పాటు పలువురు కవులు, రచయితలు సంతాపం తెలిపారు. ఎండ్లూరి సుధాకర్ సతీమణి రచయిత్రి డాక్టర్ పుట్ల హేమలత కూడా ఇటీవలే మరణించారు. సుధాకర్‌కు ఇద్దరు కూతుళ్లు. ఆయన కూతురు మానస సాహితీవేత్తగా ముందుకు వచ్చారు. మనోజ్ఞ అనే కూతురు కూడా ఉంది.