గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటి ఆషిమ నర్వాల్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ (Green India challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. తాజాగా సినీ నటి ఆషిమ నర్వాల్‌ (Ashima Narwal) జూబ్లీహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యవరణాన్ని కాపాడటానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు.

వాతావరణంలో మార్పులు అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమంగా ఎంతగానో అవసరమని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం తన స్నేహితులు నలుగురికి చాలెంజ్ విసిరారు.