ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. గత నెల 8న కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ దవాఖానలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత నెలాఖరులో కరోనా నుంచి కోలుకున్న ఆమె.. మెరుగవుతున్న దశలో శనివారం రాత్రి మళ్లీ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.