కీసరలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్‌ ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌ నగర శివార్లలోని కీసర మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మండలంలోని రాంపల్లి సమీపంలో ఉన్న ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తానికి విస్తరించాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో నల్లని మబ్బు కమ్ముకున్నది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. రసాయనాలు ఉండటంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.