రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఛాలెంజ్ ను స్వీకరించి విశాఖపట్నంలోని రిషికొండలో ఉన్న GVMC పార్క్ లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మూడు మొక్కలు నాటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరు.. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఒక మనిషి మూడు మొక్కలు నాటితే… తన జీవిత కాలానికి సరిపడా ఆక్సిజన్ ను అవి అందిస్తాయని తెలిపారు. సాగర తీరాన ఉన్న విశాఖ ను ప్రకృతికి పర్యావరణానికి చిరునామాగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్బంగా.. విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ కి… GVMC కమిషనర్ శ్రీజన తో పాటు.. ప్రముఖ హీరో నాగార్జున కి.. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ మహా ఉద్యమంలో ఇప్పటికే కోట్ల మంది భాగస్వాములు అయ్యారని.. గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఈ స్ఫూర్తిని కొనసాగించాలని… అనతికాలంలోనే రాష్ట్రం హరితాంధ్ర ప్రదేశ్ గా మారుతుందని ధీమావ్యక్తంచేశారు.