నేడు ఇండస్ట్రీ సమస్యలపై సినీపరిశ్రమ పెద్దల భేటీ

గత కొన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్న తెలుగు సినీపరిశ్రమ  (Telugu film industry) పెద్దల సమావేశం నేడు జరుగనుంది. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు సహా ఇండస్ట్రీలోని 24 శాఖలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరుగనున్న ఈ భేటీలో సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.

సినిమా టికెట్లకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో జరిగిన చర్చలపై పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడనున్నారు. అదేవిధంగా సినీపరిశ్రమ, కార్మికుల సంక్షేమం తదిరత అంశాలు చర్చకురానున్నాయి. ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి నేతృత్వంలో పలువురు హీరోలు, దర్శకుల సమావేశానికి ముందే ఈ భేటీ జరగాల్సి ఉన్నది. అయితే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నది‌.