తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సతీమణి పద్మక్క కన్నుమూత

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ(పద్మక్క) కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో కొన్నిరోజులుగా నిమ్స్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. 

అల్లం పద్మ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లం నారాయణను ఫోన్‌లో పరామర్శించి ఓదార్చారు. బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో అల్లం పద్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

కాగా, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణం పట్ల మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.