తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లైనా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో రూ.10 వేలు జరిమానా విధించింది. మార్చి 15లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయకపోతే సంబంధిత అధికారుల నుంచి జరిమానా వసూలు చేయాలంటూ ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణశాఖ తీరు ఇలాగే కొనసాగితే విచారణకి సంయుక్త కార్యదర్శి హాజరుకావాలని ఆదేశిస్తామని ఎన్జీటీ పేర్కొంది. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయాన్ని కూల్చడం అక్రమమంటూ రేవంత్‌రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణశాఖ తెలంగాణ హైకోర్టుని తప్పుదోవ పట్టించిందన్న రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. హైకోర్టుకి కేంద్రం తప్పుడు సమాచారమిచ్చిందని శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ పక్కనే సచివాలయం ఉన్నందున కేంద్ర పర్యావరణశాఖ అనుమతులివ్వాలన్నారు. రాష్ట్ర పర్యావరణ కమిటీ అనుమతులు పొందడం అక్రమమని లాయర్ పేర్కొన్నారు. తదుపరి విచారణ మార్చి 15కి వాయిదా వేసింది.
