ఐదు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ఫలితాలపైనే అందరి దృష్టి ఉన్నది. మొదట పోస్టల్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను కౌంట్‌ చేస్తారు. యూపీలో 403 స్థానాలకు ఏడు విడుతల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు.

ఇక పంజాబ్‌లో 117 స్థానాల్లో ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1304 మంది పోటీచేశారు. వీరిలో 93 మంది మహిళా అభ్యర్థులు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాల్లో 632 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 13 జిల్లాల పరిధిలో ఓట్లు లెక్కిస్తున్నారు. గోవాలో 40 అసెంబ్లీ స్థానాల్లో 332 మంది పోటీచేశారు. ఇక మణిపూర్‌లో 60 స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 265 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.