
భువనేశ్వర్ గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్‌రోడ్డులో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పొగమంచు కారణంగానే బస్సు ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.