కేంద్ర అటవీ టాస్క్‌ఫోర్స్‌లో డోబ్రియల్‌కు చోటు

అడవుల సంరక్షణ, పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో తెలంగాణ పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియల్‌కు చోటుదక్కింది. ఈ కమిటీకి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ను చైర్మన్‌గా, మరో 18 మందిని సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ జాతీయ అటవీ విధానం, అటవీ పరిరక్షణ చట్టంలో మార్పులు, ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం పెంపుపై కార్యాచరణ రూపొందిస్తుంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచనల అమలుకు మరో గ్రూప్‌ ఆఫ్‌ ఆఫీసర్స్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. ఇందులో కూడా ఆర్‌ఎం డోబ్రియల్‌కు చోటుదక్కడం విశేషం. రెండు కమిటీల్లో స్థానం దక్కడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న హరితహారం వల్లే తెలంగాణ అటవీశాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు.