జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదైంది. ఆ ప‌రిశ్ర‌మ నుంచి అర్ధ‌రాత్రిపూట విష‌వాయువులు విడుద‌ల చేయ‌గా, తీవ్ర ఇబ్బందిప‌డ్డామ‌ని వినాయ‌క్‌న‌గ‌ర్ కాల‌నీవాసులు ఫిర్యాదు చేశారు.

రాత్రి నుంచి ఉద‌యం వ‌ర‌కు ద‌గ్గు, క‌ళ్లు, ముక్కు మంట‌తో స్థానికులు ఇబ్బందిప‌డ్డారు. ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందిప‌డ్డ‌ట్లు కాల‌నీవాసులు తెలిపారు. వినాయ‌క్‌న‌గ‌ర్ కాల‌నీ అసోసియేష‌న్ ఫిర్యాదు మేర‌కు అధికారులు ఆ కంపెనీపై కేసు న‌మోదు చేశారు.