తెలంగాణ రాష్ట్ర చాప్టర్ ఐఎ్‌ఫఎస్ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్‌చంద్ర పర్గెయిన్‌ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలుసింగ్ మేరు, కార్యదర్శిగా వినయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ ప్రభాకర్, కోశాధికారిగా శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. అధ్యక్షుడు మోహన్ చంద్ర పర్గెయిన్ మాట్లాడుతూ.. అధికారుల సమస్యల పరిష్కారానికి కార్యనిర్వహక వర్గం చర్యలు తీసుకుంటుందన్నారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు.
