పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత పార్లమెంట్‌ ఎన్నో చట్టాలను చేసిందని, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు అయ్యే దిశగా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇందు కోసం ప్రత్యేక బెంచ్‌లు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. చండీగఢ్‌లో  పర్యావరణ వైవిధ్యం – న్యాయవ్యవస్థపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పర్యావరణ హితమైన జీవనవిధానం అవలంబించడం ఉత్తమమని, అందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.