తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్ష‌లు చెప్పిన మోదీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో విషెస్ తెలియ‌జేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు అని, కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని మోదీ అన్నారు. తెలంగాణా రాష్ట్ర సంస్కృతికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంద‌ని, తెలంగాణా ప్రజల శ్రేయస్సు కోసం తాను ప్రార్ధిస్తున్న‌ట్లు మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.