జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు రాష్ట్ర స‌మాచార‌, ప్ర‌జా సంబంధాల విభాగం ప్ర‌క‌టించింది. అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను జూన్ 10వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా స‌మ‌ర్పించొచ్చ‌ని తెలిపింది. ప్రింట్, ఎల‌క్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీస్ సంస్థ‌ల యాజ‌మాన్యాలు.. ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగించాల‌ని విన్న‌వించిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను https://ipr.telangana.gov.in/ అనే వెబ్‌సైట్ ద్వారా స‌మ‌ర్పించొచ్చు.