ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.70వేలు లంచం తీసుకుంటుండగా సీతారాంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషపూర్ గ్రామంలో గ్రామ కంఠం సంబంధించిన రెండు ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సీతారాం లంచం డిమాండ్ చేశాడు. సుదర్శన్ అనే వ్యక్తి నుంచి డబ్బు తీసుకుంటుండగా రిజిస్ట్రార్ రెడ్ హ్యాండ్‌డెడ్‌గా పట్టుబడ్డాడు. సీతారాంతో పాటు కిషోర్ అనే మరో ప్రైవేట్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సీతారాం నివాసం, కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
