5వ విడుత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ప్రారంభం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన హ‌రిత‌హారం స్ఫూర్తితో రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా నాలుగు విడుత‌ల‌ను పూర్తి చేసుకుని ఇవాళ‌ ఐదో వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ప్ర‌తిష్టాత్మ‌క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ విడుత కార్య‌క్ర‌మాన్ని ఇషా ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జ‌గ్గీ వాసుదేవ్‌తో క‌లిసి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ మండ‌లం గొల్లూరు అర్బ‌న్ ఫారెస్టులో వాసుదేవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.