ఆర్పీఎఫ్ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతిచెందాడు. అత‌డిని ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు పోలీసులు రైల్వే అధికారులు స‌మాచార‌మిచ్చారు.

త్రివిధ ద‌ళాల్లో సైనిక నియామ‌కం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిప‌థ్‌ స్కీంను నిర‌సిస్తూ కొంత‌మంది యువ‌కులు సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఆందోళ‌న‌కు దిగారు. రైళ్ల‌ను ద‌హ‌నం చేశారు. రాళ్ల‌తో దాడిచేశారు. ప‌రిస్థితి అదుపుత‌ప్ప‌డంతో ఆర్పీఎఫ్ కాల్పులకు దిగింది. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 8 మందికి గాయాలైన‌ట్లు స‌మాచారం.