38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్‌

వర్షాకాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, గతంలో మాదిరి సంఘటనలు పునరావృతం కారాదని మంత్రి కేటీఆర్, స్పెషల్‌ సీఎస్‌ల నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఈఎన్‌సీల వరకు కొంతకాలంగా హెచ్చరించినా విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన 38 మంది ఇంజినీర్లపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారికి ఒకరోజు వేతనం కోత విధిస్తూ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. 13 సర్కిళ్లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు(డీఈఈ), అసిస్టెంట్లు ఇంజినీర్లు(ఏఈ) వీరిలో ఉన్నారు.  డీఈఈలే ఈఈలుగా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నవారు వీరిలో ముగ్గురు  ఉన్నారు.