సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం

సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 5 మంది మహిళా కూలీలు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్‌ కరెంట్‌ తీగలు తెగిపడిపోయాయి. దీంతో, ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న ఐదు మంది మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు.  మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.