టెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను అధికారులు వెల్లడించారు.

– టెట్ పేపర్-1లో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత, 32.68% ఉత్తీర్ణత సాధించారు.
– టెట్ పేపర్-2లో 1,24,535 మంది అర్హత, 49.64 % ఉత్తీర్ణత సాధించారు.
కాగా, ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక, జూన్‌ 12న నిర‍్వహించిన టెట్‌ పరీక్ష పేపర్‌-1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ‍్యర్థులు హాజరయ్యారు.