తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాల‌యాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాల‌యాల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయికి ఉన్న‌తీక‌రించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స‌ర్కిళ్ల‌ను ఉపాధి అందించే శిక్ష‌ణా కేంద్రాలుగా మార్చి నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డం, త‌దిత‌ర విద్యా సంక్షేమ అంశాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎస్ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, రోహిత్ రెడ్డి, విద్యాసాగర్, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ్ రావు, సీఎం సెక్ర‌టరీ భూపాల్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సీఎంవో సెక్రటరీ రాహూల్ బొజ్జా, సీఎం ఓఎస్డీ వర్గీస్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రోనాల్డ్ రోస్, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, అల్ప సంఖ్యాక వర్గాల గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బి షఫియుల్లా, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ, బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.