తెలంగాణలో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు

గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో భాగంగా వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.