గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంతో రాష్ట్రం ఆకు పచ్చని తెలంగాణ మారి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
హరితహారం స్ఫూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.