బోయినపల్లి వినోద్‌కుమార్‌ పదవీకాలం పొడిగింపు

రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వు లు వెలువడే వరకు వినోద్‌కుమార్‌ ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.