ఏసీబీ వలలో భూపాలపల్లి ఎస్‌ఐ నరేష్‌

రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్‌ఐ ఇస్లావత్ నరేష్‌ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్‌ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏసీల వ్యాపారం చేసే ఉదయ్ శంకర్ అనే వ్యాపారిని సివిల్ పంచాయతీ విషయంలో ఎస్ఐ నరేష్ రూ. 75,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చేసేదేమి లేక ఉదయ్ శంకర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఏసీబీ అధికారుల సూచనల మేరకు..ఎస్‌ఐ తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్‌లోనే ఉదయ్ శంకర్ నుంచి రూ. 25.000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ఎస్‌ఐ నరేష్ ను హాజరు పరుస్తామని డీఎస్పీ హరీశ్‌ కుమార్ తెలిపారు.