డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో వైభవంగా దసరా వేడుకలు

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని భవానీపురం గ్రామంలోగల డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ దసరా వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బంగారు రాజు, లక్ష్మీ దంపతులతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ పార్వతి, డైరక్టర్ (వర్క్స్) వెంకటేశ్వర్లు-విజయలక్ష్మి దంపతులు పాల్గొని ఆ సంస్థ ఆవరణలో ఉన్న శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ పరిశ్రమల వారు ఏర్పాటు చేసిన దుర్గామాత వద్దకు మహిళలు బతుకమ్మలు పేర్చి కోలాటలు ఆడి భక్తిశ్రద్ధలతో దుర్గా మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాస రాజు, చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్. నాగమల్లేశ్వరరావు వివిధ డిపార్ట్మెంట్ల ఇన్ ఛార్జ్ లు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.