కెమికల్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వ్యక్తిగత భద్రత అత్యంత కీలకమైందని కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఫ్యాక్టరీస్ శాఖ డైరెక్టర్, నేషనల్ సేఫ్టీ తెలంగాణ చాప్టర్ ఛైర్మన్ బి. రాజగోపాల రావులు అన్నారు. శుక్రవారం రసాయన కర్మాగారాల్లో వ్యక్తిగత భద్రత అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షా్‌పను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముడిసరకు వచ్చిన దగ్గర నుంచి తుది ఉత్పత్తి బయటకు వెళ్లే వరకు అన్ని దశల్లోనూ వ్యక్తిగత భద్రతకు పెద్దపీట వేయాలని కోరారు. ఈ వర్క్‌షా్‌పకు అత్యధికంగా 422 మంది ప్రతినిధులు హాజరుకావడంపై హర్షం వ్యక్తం చేశారు.