ఫార్మా పరిశ్రమల కలుష్యంతో జలాలు కలుషితమై పంటలతోపాటు ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫార్మా పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా కాలుష్య నీటిని బయటకు వదిలి నష్టం కలిగిస్తున్నాయని సీపీఎం నాయకులు తెలుగు సత్తయ్య తదితరులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పర్యావరణ శాస్త్రవేత్త దామోదర ప్రసాద్, ఏఈ సంగీత లక్ష్మి పాల్గొని విచారణ చేపట్టారు. నాలుగు పరిశ్రమల్లో నీటి నమూనాలు సేకరించారు. వర్షపు నీటితోపాటు పరిశ్రమలు నుంచి వస్తున్న వాటిని అక్కడి పంటలను పరిశీలించారు. శుద్ధి ప్లాంటును పరిశీలించారు. మరో 4 పరిశ్రమలను పరిశీలించిన అనంతరం. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఏఈ సంగీత లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సత్తయ్య, సీఐటీయూ జిల్లా కార్య దర్శి కురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.