మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీలో సీఈసీ తీరు ఆక్షేపణీయం

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీలో  కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీరు ఆక్షేపణీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్‌పై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డురోలర్ గుర్తును తిరిగి కేటాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. మునుగోడులో బీజేపీ దొడ్డిదారిన గెలవాలని చూస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.