సినీ నటుడు, దర్శకుడు పోసాని మురళీ కృష్ణకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపీఎస్ఎఫ్టీడీసీ) చైర్మన్గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
రచయితగా చిత్ర పరిశ్రమలో కెరీర్ను మొదలుపెట్టిన పోసాని, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత వైఎస్ జగన్కు మద్దతు తెలుపుతూ వచ్చారు. గత ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున ప్రచారం చేశారు.