
చెట్లు ఉంటే క్షేమం.. చెట్టులేకుంటే క్షామము. ఇంటింటా చెట్లు ఊరూరా వనం ! అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా కొండపలకల గ్రామం ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ మందల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసిఆర్ మానస పుత్రికైన తెలంగాణకు హరితహారం స్పూర్తితో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్పదని అన్నారు. పర్యావరణ సమతుల్యత జరగాంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనే ఉద్దేశ్యం మహా గొప్పదన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ సత్యనారాయణరెడ్డి, అపర్ణ శ్రీలత, అబ్దుల్ నయన్ శంకర్, రామచందర్ రెడ్డి, రఘు రవీందర్, విజయకుమార్ చతరాజు పాల్గొన్నారు.