* ప్రజా అభిప్రాయ సేకరణలో రైతుల ఆవేదన
* ప్రజా అభిప్రాయ సేకరణ ప్రజల మధ్యన కాకుండా ప్రైయివేట్ ప్రదేశంలో పెట్టడం ఏంటి
* క్రషర్లను ఎత్తివేసి మా భూములు మాకు ఇవ్వాలి
* స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
268 సర్వే నంబర్ మైనింగ్ జోన్లో ప్రస్తుతం కొనసాగుతున్న క్రషర్లకు తిరిగి కొనసాగించుకునేందుకు అనుమతులు ఇవ్వోద్దంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిరాల, చిన్నరావిరాల, గువ్వలేటి గ్రామాల రైతులు, ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ అధికారుల సమక్షంలో వివరించారు. బుధవారం జీఎంఆర్ సంస్థకు చెందిన క్వారీ, క్రషర్ కంపెనీపై స్థానిక రైతులు, ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకట్ నర్సు, ఇబ్రంహీంపట్నం ఆర్డీవో వెంకటచారి హాజరయ్యారు. రైతులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు సుమారు 40 మందికి పైగా తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేశారు. క్రషర్ మిషన్ల వల్ల తమ ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని, జంతువులు అనారోగ్యాల పాలై మృత్యువాత పడుతున్నాయని, చెట్లు, పంటల అభివృద్ధి చెందట్లేదని అధికారుల ముందు రైతులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ప్రారంభమైన ఈ క్రషర్ మిషన్ల వల్ల చాలా నష్టం ఏర్పడిందని, చేసిన నష్టాలకు ఇక స్వస్తి పలకాలని తెలిపారు. 268 సర్వే నెంబర్లు భూములు కోల్పోయిన రైతులకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరిహారం ఇప్పిచ్చేందుకు ముందుకు రావడంలేదని, బండరావిరాల గ్రామాన్ని దత్తకు తీసుకొని తను చేసింది ఏమిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సద్దుపల్లి చౌరస్తాలో గత వంద రోజుల నుంచి పరిహారం కోసం చేస్తున్న దీక్ష వైపు ఇంతవరకు ఎమ్మెల్యే, ఇతర అధికారులు కన్నెత్తి చూడటం లేదని రైతులు అన్నారు. క్రషర్ నుంచి నగరానికి టిప్పర్లలో అధిక లోడుతో కంకరను తరలిస్తున్న క్రమంలో రోడ్లపై పరిపోయి వాహనదారులు ప్రమాదాలకు గురై చాలామంది చికిత్స పొందుతున్నారని అన్నారు. క్రషర్ల వల్ల మాకు ఒరిగింది ఏమీలేదని, కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాలేరని వారు అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల మధ్యనే నిర్వహించాలి కానీ అధికారులు దానికి విరుద్ధంగా ప్రైవేట్ స్థలాలలో నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనింగ్ జోన్ లో భూములు కోల్పోయిన మేము పరిమహారం కోసం ఎదురుచూసుకుంటు మా ప్రాణాలను ఫణంగా పెడుతున్నామని రైతులు అన్నారు.
రైతులు, ప్రజలను మోసం చేసే ప్రభుత్వాలను గద్దె దించేందుకు సిద్ధమైతావని బండరావిరాల సర్పంచ్ కవాడి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత 18 సంవత్సరాల నుంచి ఈ క్రషర్లతో మా ఆరోగ్యాలతో పాటు పంటలు, రోడ్లు, ప్రాణాలు చాలా నష్టపోయామని తెలిపాడు.
స్థానికులకు సరైన న్యాయం అందట్లేదని ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయి: అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు
ఈ క్రషర్ మిషన్ యజమానులు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. లేదంటూ, వారి వద్ద ఉన్న వాహనాలను క్రషర్ మిషన్ యజమానులు పని కనిపించడం లేదని, పశువులు పంట నష్టం విపరీతంగా జరుగుతుందని వీటిపై ఎక్కువ మంది తమ అభిప్రాయాలను తెలిపినట్లు తిరుపతిరావు సూచించాడు. ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రజలతో పాటు బండరావిరాల సర్పంచ్ కవాడి శ్రీనివాసరెడ్డి, చిన్నరావిరాల మాజీ సర్పంచ్ జలగం వెంకటేశం, నాయకులు దంతూరి మహేందర్ గౌడ్, సురకింటి శ్రీనివాస్ కంపెనీల యజమానులు పాల్గొన్నారు రెడ్డి, కళ్లెం లింగారెడ్డి, వివిధ క్రషర్ కంపెనీల యజమానులు పాల్గొన్నారు.