తమ గ్రామంలో ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలని కొండమడుగు గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని కొండమడుగు గ్రామశివారులో అస్టల్, అజంతా రసాయన పరిశ్రమల వద్ద గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నెలరోజులుగా కొనసాగుతున్నాయి. కాగా ఆదివారం గ్రామస్థులు అర్ధనగ్నంగా దీక్షలో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందక్ రసాయన కంపెనీని మూసి వేసినట్లుగా అస్టల్, అజంతా రసాయన కంపెనీని మూసివేసి ఎత్తివేసే వరకు పోరాటం ఆపబోమన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి కంపెనీల ఎత్తివేతకు ఆదేశాలు ఇవ్వాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.
