మొక్కలు మానవాళికి జీవనాధారం, ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అని నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మన సోదర రాష్ట్రం తెలంగాణ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరులోని ఎస్ఆర్ఎస్ గవర్నమెంట్ హైస్కూల్ లో 30 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడం సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. హరితాంధ్రప్రదేశ్ లో ప్రతీ ఒక్కరం భాగస్వామ్యం అవుదాం.. మొక్కలు నాటుదాం అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నా తదుపరి సవాల్ ను రాష్ట్ర డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, యాంకర్ రేష్మీగౌతంలకు ఇస్తున్నా అన్నారు.