ఫ్లోరోసిస్ బాధితుడు, ఫ్లోరైడ్పై పోరాటం చేసిన ఉద్యమకారుడు అంశాల స్వామి కన్నుమూశాడు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెం కు చెందిన స్వామి.. ప్రమాదవశాత్తు బైక్ నుంచి కింద పడటంతో ఆయన ఇవాళ మృతి చెందాడు. కాగా, స్వామి చాలా ఏళ్ళు ఫ్లోరోసిస్ సమస్యపై స్వామి ఉద్యమం చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడి అనుకున్న ఆశయం నెరవేర్చాడు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ స్వామి కీలక పాత్ర పోషించాడు. ఎన్నో సమావేశాల్లో సీఎం కేసీఆర్ కూడా అంశాల స్వామి పేరు ప్రస్తావనకు తెచ్చేవారు. స్వామి మృతి పట్ల మంత్రులు కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంతాపం తెలిపారు.