ఫార్మా కంపెనీ ఏర్పాటును అడ్డుకుందాం : సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం

మునుగోడు మండలంలోని కృష్టాపురంలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీని అడ్డుకుంటామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. మునుగోడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన రౌండ్‌టేబుల్‌ సమా వేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజల ఆరోగ్యాలను హరిం చడంతో పాటు పంటలపై తీవ్రప్రభావం చూపే ప్రమాదం ఉం దని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఇన్నాళ్లుగా ఫ్లోరైడ్‌ రక్కసి బారిన పడి దీర్ఘకాల సమస్యలు ఎదుర్కొని దుర్భర జీవితాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇప్పుడిప్పుడే సమస్య పరిష్కారమవుతున్న తరుణంలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసేందుకు కొందరు వ్యాపార థృక్పదంతో ముందుకు వస్తున్నారన్నారు. ఈ కంపెనీతో భూగ్భజలాలు, వాయు కాలుష్యం సమస్యలు ఉత్పన్నమవుతాయ న్నారు. ప్రజలు, వ్యవసాయ రంగాలతో పాటు అన్నిరకాలుగా తీవ్ర ప్రతికూల పరిస్థితులతో విషప్రభావం చూపుతాయన్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన మం డలకేంద్రంలో భారీ ధర్నా నిర్వహించాలని తీర్మానించారు. కార్య క్రమంలో నాయకులు జాజుల అంజయ్య, చాపల మారయ్య, తాటికొండ సైదులు, మారగోని అంజయ్య పాల్గాన్నారు.