ఫ్యాక్టరీలు వద్దు.. పాఠశాలలు ముద్దు : అఖిలపక్షనాయకులు

  • మెట్‌పల్లి పాత బస్టాండ్‌ వద్ద అఖిలపక్షనాయకుల రాస్తారోకో
  • ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన అఖిలపక్షనాయకులు

వ్యవసాయానికి మూల కేంద్రంగా నిలిచే పల్లెల్లో ఇథనాల్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం గురుకులం, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్షం నాయకులు గురువారం మెట్‌పల్లి పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మెట్లచిట్టాపూర్‌ రైతులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో వినోద్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సదర్భంగా తెలంగాణ జన సమితి రైతు విభాగం అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మెట్లచిట్టాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్లు 498, 506గల భూములలో ఇండస్ట్రీయల్‌ పార్క్‌, ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కు వ్యతిరేకంగా రైతులతో కలిసి ధర్నా చేశామన్నారు. గ్రామంలో వ్యవసాయంపై ఆ ధారపడ్డ బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చి నట్టే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని లాక్కోవడం దారణం అన్నారు. పట్టాదా రు లకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా వారి భూములను లాక్కొని చదును చేసి స్వాధీనం పరచుకోవడంతో పేద రైతులు ఎం చేసుకొని బతకాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదివరకే అక్కడ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు కోసం గురుకులం, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గతంలో సర్వే చేసిందన్నారు. పాఠశాలలు నిర్మించిన తర్వాత మిగిలిన భూమిలేని పేద రైతులు సాగు చేసుకోవడానికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చే శారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు కొమిరెడ్డి కరంచందు, సురభి నవీన్‌రావు, బోడ్ల రమేష్‌, పుప్పాల లింబాద్రి, చెట్లపల్లి సుఖేందర్‌గౌడ్‌, అల్లూరి మహేందర్‌రెడ్డి, రైసోద్దిన్‌, కంతి రమేష్‌, వన్నెల శివ, రైతులు పాల్గొన్నారు.