తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (ఆర్టీఐ) ఖాళీ అయ్యింది. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో ఆ కమిషన్లో సిబ్బంది మాత్రమే మిగిలారు. 2017లో రాష్ట్ర సమాచార కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఈ కమిషనర్లను ఎంపిక చేసింది. ప్రధాన కమిషనర్గా బుద్దా మురళిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ తర్వాత సీనియర్ జర్నిలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్, గిరిజన విద్యార్థి శంకర్ నాయక్లను కమిషనర్లుగా ఎంపిక చేసింది. వీరి నియామకానికి అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేయడంతో.. అందరినీ ఒకేసారి కమిషనర్లుగా నియమించారు. ఇవాళ పదవి కాలానికి చివరి రోజు కావడంతో వీరంతా ఒకేరోజు పదవీ విరమణ చేశారు. ఇక బుద్దా మురళి జనవరిలోనే పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఎవరినీ ఇప్పటివరకు ప్రధాన కమిషనర్గా ఎంపిక చేయలేదు.