హైదరాబాద్ బషీర్ బాగ్ లోని శక్కర్ భవన్ లో భారీ వృక్షాలను నరికివేశారు. అటవీశాఖ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద చెట్లను శక్కర్ భవన్ అధికారులు నరికి వేయించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చెట్లను నరికివేసిన ప్రాంతానికి వెళ్లారు. చెట్లను నరికివేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక జేసీబీతో పాటు కట్టింగ్ మిషిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.