కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యంశాలు…


బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  లోక్‌సభలో బడ్జెన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యంశాలు: …
*  గత ఎన్నికల్లో ప్రజలు మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో అధికారం అప్పగించారు. 

*  ప్రజలు ఇచ్చిన తీర్పుతో పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధికి పనిచేస్తున్నాం. 
*  ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌
*  యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వం ప్రాధమ్యాలు ఉంటాయి. 
*  సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు
*  ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి, ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. 
*  నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. 
*  కేంద్ర, రాష్ర్టాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు వెలుతుంది. 
*  జీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొంది
*  చెక్‌పోస్టుల విధానానికి చెట్టిపెట్టి కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలికాం. 
*  జీఎస్టీలోని సమస్యల పరిష్కారానికి జీఎస్టీ మండలి వేగంగా పనిచేస్తుంది. 
*  జీఎస్టీ అమలు తరువాత సామాన్యులకు నెలవారి ఖర్చు 4శాతం ఆదా అయింది. 
*  కొత్తగా 16లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరారు.
*  ఇప్పటి వరకు రూ.40కోట్ల జీఎస్టీ రిటర్న్‌లు దాఖలయ్యాయి. 


*  మొదటి ప్రాధాన్యాంశం వ్యవసాయం, ,సాగునీరు, గ్రామీణాభివృద్ధి
*  ద్వితీయ ప్రాధాన్యాంశం ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
*  మూడో ప్రాధాన్యాంశం విద్య, చిన్నారుల సంక్షేమం
*  2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉన్నాం. 
*  ప్రధాని ఫసల్‌ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
*  పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం. 
*  కృషి సంచాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం
*  గ్రామీణ సడక్‌ యోజన, ఆర్థిక సమ్మిళత విధానాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. 
*  పోలాల ఉత్పాదకత పెంచడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం.
*  వ్యవసాయ నిపుణులను మరింత సరళీకరించాం. 
*  పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం
*  వర్షాభావ జిల్లాలకు అదనంగా నిధులు
*  వర్షాభావ జిల్లాలకు సాగునీటి సౌకర్యం
*  రైతులకు 20 లక్షల సోలార్‌ పంపుసెట్లు
*  బీడు భూముల్లో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం
*  రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి
*  భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు రైతులకు సహాయం.
*  రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం
*  గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వార సాయం
*  మహిళా స్వయం సహాయ సంఘాల ద్వార ధాన్యలక్ష్మి పథకం అమలు
*  ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌బీలకు సాయం
*  కూరగాయల సరఫరాకు కిసాన్‌ రైల్వే, కిసాన్‌ ఉడాన్‌ యోజన
*  కూరగాయలు, పండ్లు, పూల ఎగుమతులు, రవాణాకు ప్రత్యేక విమానాల వినియోగం
*  ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం. 
*  కేంద్ర, రాష్ర్టాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపు
*  ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు
*  పశువుల్లో కృత్రిమ గర్భదారణకు అదనపు సౌకర్యాలు
*  పాలఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి
*  రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లు..
*  ఆల్గే, సీవీకేజ్‌కల్చర్‌ విధానంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సహకాలు
*  కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్య్స పరిశ్రమలో మరింత ఉపాధి
*  3400 సాగర్‌ మిత్రలు ఏర్పాటు
*  గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు

* మిషన్‌ ఇంద్రధనస్సు ద్వారా టీకాలు
* ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛభారత్‌ ద్వారా కొత్త పథకాలు
* ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం
* ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో రాని ఆస్పత్రులను ఈ పరిధిలోకి తీసుకొస్తాం. 
* టీబీ హరేగా దేశ్‌ బచేగా పేరుతో క్షయవ్యాధి నివారణకు ప్రత్యేక కార్యక్రమం
* క్షయవ్యాధి నిర్మూలనతోనే దేశం విజయం
* బహిరంగ మలమూత్ర విసర్జనరహిత దేశంగా భారత్‌
* ఓడీఎఫ్‌ ప్లస్‌ ద్వారా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం
* స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.12,300 కోట్లు
*  జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.11,500 కోట్లు
* ప్రధాని జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6,400 కోట్లు
* ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు
* 2030 నాటికి అత్యధికంగా పనిచేయగలిగిన యువత ఉండే దేశంగా భారత్‌
* దేశవ్యాప్తంగా స్థానికసంస్థల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అప్రెంటీస్‌ విధానం
* దేశంలో వైద్యనిపుణుల కొరత తీర్చేందుకు కొత్త విధానం
* జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు
* భూమి, సౌకర్యం కల్పించే రాష్ర్టాలకు కేంద్రం నుంచి సాయం
* వైద్య పీజీ కోర్పుల కోసం పెద్దాసుపత్రులకు ప్రోత్సాహం


* విద్యారంగంలో మార్పుల కోసం ప్రత్యేక నూతన విద్యావిధానం
* 2026 నాటికి 150 విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులు
* విద్యారంగానికి రూ.99,300 కోట్లు
* నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3వేల కోట్లు
* వర్సిటీల కోసం త్వరలో జాతీయస్థాయి విధానం
* ఉపాధ్యాయులు, పారామెడికోల కొరత తీర్చేలా కొత్త విధానం

* ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం 
* ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి ఊతమిచ్చేందకు కొత్త పథకాలు
* మొబైల్స్‌ తయారీ, సెమీకండక్టర్ల పరిశ్రమలకు ప్రత్యేక పథకం, త్వరలో విధివిధానాలు
* దేశీయ మొబైల్‌ తయారీ పరిశ్రమలకు ప్రోత్సహకాలు
* రూ.లక్షా 3 వేల కోట్లతో మౌలికరంగ ప్రాజెక్టులు ప్రారంభం
* రాష్ర్టాల భాగస్వామ్యంతో కొత్తగా 5ఆకర్షనీయ నగరాలు
* జౌళిపరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు త్వరలో ప్రత్యేక విభాగం
* జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకం
* జౌళిరంగానికి రూ.1480 కోట్లు
* చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో కొత్త బీమా పథకం
* త్వరలో జాతీయ సరకు రవాణా విధానం
* రూ.2వేల కిలోమీటర్ల ల్యాండ్‌ టు పోర్టు రూట్‌కు రహదారుల నిర్మాణం
* ప్రతి జిల్లాను ఒక ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా రూపొందించాలనేదే ప్రధాని ఆలోచన
* అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతుల ప్రోత్సహకానికి ప్రత్యేక మండళ్లు
* ఎగుమతిస్థాయి ఉత్పత్తుల పరిశ్రమలకు రాయితీలు
* రాష్ర్టాల స్థాయిలో విద్యుత్‌ బిల్లులు, రవాణా వ్యయం, వ్యాట్‌, ఇతర పన్నులకు ఊరటనిచ్చేలా చర్యలు
* ఓడరేవులకు అనుసంధానం చేసే రహదారుల అభివృద్ధి
* పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సహకానికి రూ.27,300 కోట్లు

* బెంగళూరుకు రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకం
* కేంద్రం 20శాతం అదనపు నిధుల ద్వారా 60శాతం సమీకరణ
* 11వేల కిలోమీటర్ల మేర రైల్వేమార్గాల విద్యుదీకరణ
* రైల్వేట్రాక్‌ల వెంబడి భారీ సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు
* ముంబయి – అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు
* పర్యాటకరంగ ప్రోత్సహానికి త్వరలో మరిన్ని తేజస్‌ రైళ్లు
* రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1.7 లక్షల కోట్లు
* ప్రతి ఇంటి గడపకు విద్యుత్‌ తీసుకెళ్లడం అతిపెద్ద విజయం
* నదీతీరాల వెంబడి అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సహం
* నేషనల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,300 కి.మీ నుంచి 27 వేల కి. మీలకు పెంచేందుకు చర్యలు
* వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ప్రిపెయిడ్‌ మీటర్లు
* దేశవ్యాప్తంగా డేటాసెంటర్‌ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం
* ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింక్స్‌, ఫైనాన్సియల్‌ టెక్నాలజీలో కొత్త సంస్కరణలకు మరిన్ని చర్యలు
* లక్ష గ్రామాలకు ఓఎఫ్‌సీ ద్వారా డిజిటల్‌ కనెక్టివిటీ
* జాతీయ గ్రిడ్‌తో లక్ష గ్రామాలకు అనుసంధానం
* 2024 నాటికి దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలు
* అంగన్వాడీలు, పాఠశాలలు, గ్రామపంచాయతీలు, పోలీస్‌స్టేషన్‌లకు డిజిటల్‌ అనుసంధానం