తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో సోమవారం ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ ఇంజినీర్ రఘు పాల్గొని కేక్ కట్ చేసి మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆలోచనలో విప్లవాత్మక మార్పు రావాలని, జీవితంలో ప్రతి అంశంలో ఆత్మ విశ్వాసం కలిగి ఉండి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొని సంబురాలు జరుపుకున్నారు. టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేట్రివ్, అకౌంట్స్, హౌస్ కీపింగ్ తదితర విభాగాలకు సంబంధించిన రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిలు అధిక సంఖ్యలో పాల్గొని ఉల్లాసంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జోనల్ కార్యాలయం జెసిఇఇ డి. కృపానంద్, జెసిఇఎస్ ఎం. సత్యనారాయణ రావు, ఇఇ రామప్ప సిద్ది తదితరులు పాల్గొన్నారు.
