సికింద్రాబాద్(Secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ ఘటనతో జంట నగరా లప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది(Fire Officials) అప్రమత్తతో పెనుప్రమాదం నుంచి బయటపడినా..భారీగా ప్రాణనష్టం, ఆస్థినష్టం అపలేకపోయారు. ఈ ప్రమాదంలో పొగకారణంగా అస్వస్థతకు గురైనా పలువురు స్థానికులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా గురువారం రాత్రి సికింద్రాబాద్‌లో స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)లో జరిగి భారీ అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం విషాదాన్ని నింపింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్ని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరిలో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు. రూబీ హోటల్ అగ్నిప్రమాదం (Ruby Hotel Fire Accident) ఘటనను మరువక ముందే.. సికింద్రాబాద్ (Secunderabad)లో మరో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.